![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-648 లో... కాశీ కూరగాయలు తీసుకొని వస్తాడు. కావేరి వచ్చి అవి తీసుకుంటుంది. బావ వాళ్ళింట్లో చిన్న ప్రోగ్రాం అన్నారు.. మీరు వెళ్లలేదా అత్తయ్య అని కావేరిని కాశీ అడుగుతాడు. లేదు అల్లుడు స్వప్న రానంది.. దాన్ని ఒక్కదాన్ని ఇంట్లో ఉంచి ఏం వెళ్ళాలని వెళ్ళలేదని కావేరి అంటుంది.
ఎందుకు వెళ్ళలేదు స్వప్న అని కాశీ అడుగుతాడు. అక్కడికి వెళ్తే నాతో వెటకారంగా మాట్లాడే వాళ్లకి ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందని స్వప్న అంటుంది. దేని గురించి అని కాశీ అడుగుతాడు. నీకు విడాకులు ఇస్తున్నా కదా అందుకు అని స్వప్న అంటుంది. నేను వసంత్ ని పెళ్లి చేసుకున్న రోజు అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్వప్న అంటుంది. అయితే అలాంటి సిచువేషన్ ఎప్పుడు రాదు.. నీకు వసంత్ తో పెళ్లి జరగదు.. ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది నువ్వే అని కాశీ అంటాడు. ఎలానో నువ్వే ఆలోచించు అని కాశీ అంటాడు.
మరొకవైపు జ్యోత్స్న చేసిన మోసానికి బలి అయిన వైరా డల్ గా ఇంట్లో ఉంటాడు. దాంతో తన మేనేజర్ తనని రెచ్చగొట్టి జ్యోత్స్నపై పగ తీర్చుకోవాలని చెప్తాడు. మరొక వైపు దాస్ ని జ్యోత్స్న కలిసి మాట్లాడుతుంది. నువ్వు, ఆ దీప, బావ ముగ్గురు ఒక్కటే.. ఏం చెప్పి గ్రానీని మార్చేసారో ఏంటో అని జ్యోత్స్న అంటుంది. ఎప్పటిలాగే దాస్ ని తిడుతుంది జ్యోత్స్న.
మరోవైపు స్వప్న, కాశీ మాట్లాడుకుంటారు. నువ్వు ఎంత ఆలోచించినా నీకు సమాధానం దొరకడం లేదు కదా అని కాశీ అనగానే అసలు సమాధానం ఉంటేనే కదా అని స్వప్న అంటుంది. నువ్వు వసంత్ ని పెళ్లి చేసుకోలేవు.. మొన్న వసంత్ నీ చేతికి గాజులు తొడుగుతానని అనుకుంటేనే నువ్వు తొడిగించుకోలేదు.. అప్పుడు నేను గుర్తువచ్చానని కాశీ అంటాడు. ఇప్పుడు రమ్మను గాజులు వేయించుకుంటానని స్వప్న అంటుంది. అది నీ వల్ల కాదు.. నీ పెళ్లి నువ్వే ఆపుకుంటావని స్వప్నతో కాశీ చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడతాడు.
మరొకవైపు దీప అలా మాట్లాడుతుందని అసలు అనుకోలేదు.. నా కూతురితో అలా అంటుందా అని సుమిత్ర అంటుంది. జ్యోత్స్నపై అంత ప్రేమ పెంచుకోకని దశరథ్ అంటాడు. అది నా కన్నకూతురు అని సుమిత్ర అంటుంది.. కాదని తెలిసినప్పుడు ఏం చేస్తావని దశరథ్ అడుగుతాడు. ఏంటి అలా అంటున్నారు. ఇంకొకసారి అలా అనకండి.. నా కూతురు జ్యోత్స్నని దూరం చేసే పని ఎప్పటికి చెయ్యనని మాటివ్వండి అని దశరథ్ దగ్గర సుమిత్ర మాట తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |